బాగ్‌లింగంపల్లిలో భారీ అగ్నిప్రమాదం

February 02, 2023
img

హైదరాబాద్‌ నగరంలో బాగ్‌లింగంపల్లిలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వీఎస్‌టి సమీపంలోగల ఓ గోదాములో ఈ అగ్నిప్రమాదం హరిగింది. సమాచారం అందుకొన్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకొని మంటలని ఆర్పుతున్నారు. ఈ గోదాములో పెళ్ళిళ్ళు, శుభకార్యాలయాలలో వినియోగించే టెంట్స్, ప్లాస్టిక్ కుర్చీలు, వంటపాత్రలు వగైరా ఉన్నట్లు తెలుస్తోంది. అవన్నీ మంటల్లో పూర్తిగా కాలి బూడిదైపోయాయి. మంటలు పూర్తిగా ఆర్పి, వేడి పూర్తిగా తగ్గితేగానీ లోపలకి వెళ్ళలేని పరిస్థితి. కనుక గోదాములో అగ్నిప్రమాదం జరిగినప్పుడు లోపల ఎవరైనా ఉన్నారా లేదా?ఆస్తి నష్టం ఎంత జరిగింది?  అగ్నిప్రమాదానికి కారణం ఏమిటి అనే ప్రశ్నలకి అగ్నిమాపక సిబ్బంది గోదాము లోనికి వెళితే కానీ తెలియదు. ఈ గోదాము కూడా నివాస ప్రాంతంలో ఇళ్ళ మద్యనే ఉంది. 

పది రోజుల క్రితమే నల్లగుట్టలో డెక్కన్ మాల్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం అయ్యారు. డెక్కన్ మాల్‌ని ప్రభుత్వం కూల్చివేయించింది. దానిని ఆనుకొని ఉన్న రెండు భవనాలు అగ్నిప్రమాదంలో దెబ్బ తిన్నాయి. మళ్ళీ ఇప్పుడు నివాస ప్రాంతంలో ఉన్న గోదాములో అగ్నిప్రమాదం జరుగడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related Post