బ్రహ్మానందం కన్నీళ్లు పెట్టిస్తాడా..!

నవ్వుల బ్రహ్మ.. హాస్యానికి కేరాఫ్ అడ్రెస్ అంటే అది కచ్చితంగా బ్రహ్మానందం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వెయ్యికి పైగా సినిమాల్లో నటించి గిన్నీస్ బుక్ రికార్డుల్లో కూడా స్థానం సంపాదించుకున్న బ్రహ్మానందం ఇప్పుడు కెరియర్ లో కొత్తగా కనిపించబోతున్నాడు. మరాఠీ సూపర్ హిట్ మూవీ నటసామ్రాట్ మూవీకి రీమేక్ గా కృష్ణవంశీ డైరక్షన్ లో రంగమార్తాండా సినిమా వస్తుంది.

ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బ్రహ్మానందం కూడా ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడట. బ్రహ్మి సినిమాలో ఉన్నాడు అంటే అదేదో కామెడీ వేషం కాదట. కచ్చితంగా ఆయన నటన చూసి కనీళ్లు పెట్టేస్తారని చెబుతున్నారు. మరి ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే బ్రహ్మానందం ఇలా ఏడిపించేలా చేయడం గొప్ప విషయం. కొన్నాళ్లుగా సరైన హిట్లు లేక కెరియర్ లో చాలా వెనుకపడ్డ కృష్ణవంశీ ఈ సినిమాతో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.