
రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న సినిమా పేరు ‘వారణాసి’ ఖరారు చేశారు. నిన్న రామోజీ ఫిల్మ్ సిటీలో వారణాసి ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేశారు. దానిలో మహేష్ బాబుని కూడా చూపారు.
రాజమౌళి చెపుతున్నట్లుగానే ‘వారణాసి’ ప్రేక్షకులు ఊహించిన దానికంటే చాలా గొప్పగా, హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఉంటుందని ఫస్ట్ గ్లిమ్స్‌తోనే నిరూపించారు. వారణాసి కాన్సెప్ట్, విజువల్స్, గ్రాఫిక్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి.
ఇది ప్రపంచాన్ని చుట్టి వచ్చే హీరో అడ్వంచర్ కధ అని చెప్పినప్పటికీ వారణాసి (కాశీ)తో ముడిపడి ఉందని ఫస్ట్ గ్లిమ్స్‌తో చూపించారు. ముఖ్యంగా శివుడి వాహనమైన నందిపై మహేష్ బాబు త్రిశూలం పట్టుకొని సవారీ చేస్తున్న సీన్ అద్భుతంగా ఉంది.
ఫస్ట్ గ్లిమ్స్‌లో గ్రాఫిక్స్, విజువల్స్, మహేష్ బాబుని చూపారు. కానీ మిగిలిన నటీనటులు ఎవరినీ చూపకుండా ‘రేపటి కోసం’ దాచి ఉంచారు. ‘వారణాసి’ని 2027 వేసవిలో విడుదల చేయబోతున్నట్లు ఫస్ట్ గ్లిమ్స్‌లో చెప్పేశారు.
ఈ సినిమాలో రుద్రగా మహేష్ బాబు, మందాకినిగా బాలీవుడ్ సీనియర్ నటి ప్రియాంకా చొప్రా, విలన్‌గా కుంభగా ప్రముఖ మళయాళ నటుడు పృద్విరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు.
శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ కలిసి నిర్మిస్తున్న వారణాసి నిమాకి
కధ: విజయేంద్ర ప్రసాద్,
దర్శకత్వం:ఎస్ఎస్ రాజమౌళి,
డైలాగ్స్: దేవకట్ట,
సంగీతం: ఎంఎం కీరవాణి,
కెమెరా: ఎస్.గోపాల్ రెడ్డి, పిఎస్ వినోద్,
వీఎఫ్ఎక్స్: శ్రీనివాస్ మోహన్, సందీప్ కమల్, మోహన్ నాథ్ బింగి,
ఆర్ట్: సందీప్ సువర్ణ,
ఎడిటింగ్: బిక్కిన తమ్మరాజు,
స్టంట్స్: కింగ్ సోలోమన్,
లైన్ ప్రొడ్యూసర్: ఎంఎం శ్రీవల్లి,
కాస్ట్యూమ్స్: రమ రాజమౌళి,
ఎస్ఎస్ కార్తికేయ: ప్రొడక్షన్ మేనేజ్ మెంట్ చేస్తున్నారు.