సుయోధన టీజర్‌ విడుదల

మాధవ్ రెడ్డి దర్శకత్వంలో ప్రియదర్శి, ద్రిషిక చందర్ జంటగా చేస్తున్న సినిమా సుయోధన. ఈ సినిమా టీజర్‌ నేడు విడుదలైంది. ఇది సరికొత్త కాన్సెప్ట్ అనే చెప్పాలి. మన హీరో ప్రియదర్శికి మాత్రమే ఓ వ్యక్తి దుర్యోధనుడులా కనబడుతుంటాడు. అలా ఎందుకు కనబడుతున్నాడు? ఏం జరిగిందనేది ఈ సినిమా కధ అని టీజర్‌తో చక్కగా చెప్పారు. 

ఈ సినిమాకు దర్శకత్వం: వైఎస్ మాధవ్ రెడ్డి, కథ: శ్రీను ధర్మరాజుల, శ్రీను కంబాల, పాటలు: రామజోగయ్య శాస్త్రి, సంగీతం: జయ్ క్రిష్, కెమెరా:కార్తీక్ కొప్పెర, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్టంట్స్: రామకృష్ణ, ఎడిటింగ్: చోటా కే ప్రసాద్ చేస్తున్నారు. 

ప్రజ్వల లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై బోసుబాబు నిదమోలు ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.