ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేయడానికి మరో రెండు మూడేళ్ళు పడుతుంది. కనుక కొత్తగా సినిమాలు ఒప్పుకునే పరిస్థితి లేదు. కానీ ఒప్పుకున్నారట! అదీ దర్శకుడితో ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న 'నాటు నాటు' పాట కొరియోగ్రాఫర్ రక్షిత్ దర్శకత్వంలోనట! రక్షిత్ చెప్పిన కధ నచ్చడంతో ప్రభాస్ ఆయనకు ఓకే చెప్పేశారట! అయితే ఈ విషయం ఇంకా ద్రువీకరించాల్సి ఉంది. కానీ నిప్పు లేనిదే పొగ రాదు కదా? కనుక నిజమే అయ్యుంటుంది.
ప్రభాస్ ఇటీవలే రాజాసాబ్ పూర్తి చేసి ప్రస్తుతం ఫౌజీ చేస్తున్నారు. దాని తర్వాత స్పిరిట్, సలార్, కల్కి-2 వగైరా ఉండనే ఉన్నాయి. ఇవి కార్యక్రమంలో హోంబోలే సంస్థ ప్రభాస్‌తో ఓ అరడజను సినిమాలు తీయబోతున్నామని ఇది వరకు ఎప్పుడో ప్రకటించింది. కనుక ఇన్ని సినిమాలు పెండింగులో ఉండగా ప్రభాస్ మరో కొత్త సినిమా ఒప్పుకుంటే నిజంగా చాలా ఆశ్చర్యమే.