పైసావాలా ... పైసా పైసా పాట

నవీన్ తేజస్ దర్శకత్వంలో రాజేష్ బెజ్జంకి తదితరులు నటించిన చిత్రం పైసవాలా. ఈ సినిమా నుంచి పైసా పైసా అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ విడుదల చేశారు. ఈవీఆర్, జగదీష్ కలిసి చిన్న చిన్న పదాలతో ‘పైసా’ గురించి చాలా అద్భుతంగా వ్రాసిన ఈ పాటకు సంగీతం నాగేష్ గౌరీష్ చేయగా చరణ్ ఆలపించారు. 

ఈ సినిమాలో పి. శ్రీధర్, సృజనాక్షిత, అన్సు పోన్నాచన్, నూనెలా పైదిరాజు, ఎం. సంజనా, వుకొటి వెంకటేశ్వరరావు (నాని), గుడివాడ శ్రీనివాసరావు ముఖ్యపాత్రలు చేశారు. 

నూనెల పైదిరాజు, కొర్రపాటి నవీన్ శ్రీ, పి.జె. దేవి కలిసి నిర్మించిన ఈ సినిమాకి కధ, దర్శకత్వం: నవీన్ తేజస్, సంగీతం: నాగేశ్ గౌరిష్, కెమెరా: గౌతమ్ వైయిలడ, ఎడిటింగ్: ఎం.జె. సూర్య చేశారు.