
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ చేస్తున్న అఖండ 2: నుంచి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాను 2డితో పాటు 3డీలో కూడా విడుదల చేస్తామని దర్శకుడు బోయపాటి చెప్పారు.
ఈ మేరకు ప్రకటన చేస్తూ పోస్టర్ కూడా విడుదల చేశారు. అఖండ-2 డిసెంబర్ 5న విడుదల కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నందున ఈ నెల 28న ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ నిర్వహించాబోతున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: బోయపాటి శ్రీను, సంగీతం: థమన్, కెమెరా: సి. రామ్ ప్రసాద్, సంతోష్ డి డెటాకె, ఎడిటింగ్: తమ్మిరాజు చేస్తున్నారు.
14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై ఎమ్మెల్యేలు.తేజస్విని నందమూరి, రామ్ ఆచంట, గోపీ అచంతలతో కలిసి పాన్ ఇండియా మూవీగా అఖండ-2 నిర్మిస్తున్నారు.