శివ ఫస్ట్ డే కలెక్షన్స్ : రెండున్నర కోట్లు

నాగార్జునకి, దర్శకుడు రామ్ గోపాలవర్మ ఇద్దరి సినీ కెరీర్‌ని మలుపు తిప్పి గొప్ప గుర్తింపునిచ్చిన చిత్రం శివ. 1989లో విడుదలైన శివ శుక్రవారం రీ-రిలీజ్ అయ్యింది. ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ విడుదలైనప్పటికీ సినిమాకి మంచి ఆదరణ లభించింది. మొదటి రోజే రూ.2.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. 

ఆరోజుల్లో ఈ సినిమాని కేవలం కోటి రూపాయలతో తీసి విడుదల చేయగా రూ.4 కోట్లు కలెక్షన్స్ సాధించింది. కలెక్షన్స్ మాత్రమే కాదు ఈ సినిమాలో అద్భుతమైన స్క్రీన్ ప్లే, కెమెరా, మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్, డైలాగ్స్, ఫైట్స్, నటీనటుల నటన వంటివన్నీ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. అలాగే సినీ పరిశ్రమ తీరు తెన్నులు కూడా సమూలంగా మార్చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో (నాగార్జున) సైకిల్ చైన్ సన్నివేశం ఆ రోజుల్లో యువతని చాలా ఆకట్టుకుంది. చాలా మంది సైకిల్ చైన్ పట్టుకొని ఫోటోలు దిగేవారు కూడా. 

ఇప్పుడు అత్యద్భుతమైన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కనుక మరో రెండు కోట్లు ఖర్చు చేసి ‘శివ’కి డల్బీ సౌండ్, 4కె విజువల్స్ జోడించడంతో మరింత అద్భుతంగా ఉంది.