
సిని హీరో డాక్టర్ రాజశేఖర్ కారు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పెద్ద గోల్కొండ దగ్గర బోల్తా కొట్టింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటల టైంలో వేగంగా వెళ్తున్న కారు టైర్ బరస్ట్ అవడం వల్ల డివైడర్ కు గుద్దుకోవడంతో కారు బోల్తా కొట్టింది. అటుగా వెళ్తున్న వాహనదారుడి సాయం వల్ల రాజశేఖర్ స్వల్ప గాయాలతో బయట పడటం జరిగింది.
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శం షాబాద్ సిఐ వెంకటేష్ యాక్సిడెంట్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. టైర్ బరస్ట్ వల్లే యాక్సిడెంట్ జరిగిందని జీవిత మీడియా వాళ్లతో చెప్పడం జరిగింది. అయితే కొన్ని టివి ఛానెల్స్ కారులో మధ్యం సీసాలు ఉన్నాయని చెబుతున్నారు. పోలీసులు ఎలాగు కేసు టేకప్ చేశారు కాబట్టి వారే వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రేక్షకుల ప్రేమాభిమానాలే ఆయన్ను కాపాడాయని జీవిత అన్నారు.