RRRలో రష్మిక..!

బాహుబలి తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాపై ఇప్పటికే తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున ఈ క్రేజీ మల్టీస్టారర్ మూవీని డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కొమరం భీమ్ గా ఎన్.టి.ఆర్, అల్లూరి సీతారామరాజుగా రాం చరణ్ నటిస్తున్నారు. అలియా భట్ ఇక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు.    

అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్న నటిస్తుందని తెలుస్తుంది. కిరాక్ పార్టీ సినిమాతో కన్నడలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న రష్మిక ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. చేసింది నాలుగు సినిమాలే కాని తెలుగులో రష్మికకు సూపర్ క్రేజ్ వచ్చింది. ఆర్.ఆర్.ఆర్ లో రష్మిక సెలెక్ట్ అయితే ఆమె కెరియర్ కు నిజంగా ఇదో లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు.