హనుమాన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన తేజ సజ్జా మరో కొత్త సినిమా ప్రారంభించాడు. ఘట్టమనేని కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా పేరు ‘మిరాయ్’ అని సోషల్ మీడియాలో ప్రకటిస్తూ టైటిల్ పోస్టర్, ఫస్ట్ గ్లిమ్స్ కూడా విడుదల చేశారు.
ఫస్ట్ గ్లిమ్స్ చూస్తే అలనాటి కళింగుల కాలంలో అశోక చక్రవర్తి చేసిన ఓ మహాయుద్ధంలో మారణకాండ తర్వాత మనిషికి దైవత్వం ప్రాప్తింప జేసే ఓ గ్రంధం, దాని కాపాడేందుకు తొమ్మిది మంది యోధులు, తస్కరించేందుకు జరిగే ప్రయత్నాల నేపధ్యంతో దర్శకుడు కార్తీక్ ఈ కధని అల్లుకున్నట్లు అర్దమవుతుంది.
ఈ సినిమాలో కూడా తేజ సజ్జ యోధుడుగా (సూపర్ యోధ)గా నటించబోతున్నట్లు ఫస్ట్-లుక్ పోస్టర్లోనే తెలియజేశారు.
హనుమాన్ సినిమాలాగే ‘మిరాయ్’ ఫస్ట్ గ్లిమ్స్‌లో గ్రాఫిక్స్, విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాలో తేజ సజ్జకు జోడీగా రీతికా నాయక్ నటిస్తోంది.
ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడం మలయాళం, బెంగాలీ, మరాఠీ, చైనీస్ భాషల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని 2డి, 3డి ఫార్మాట్లో నిర్మించి వచ్చే ఏడాది ఏప్రిల్ 18న అనే సరిగా ఇదే రోజు విడుదల చేయబోతున్నట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది.