పుష్ప-2 తొలి పాట లిరికల్ వీడియో...









అల్లు అర్జున్‌, రష్మిక మందన జంటగా నటిస్తున్న ‘పుష్ప-2 ది రూల్’ సినిమా నుంచి తొలి లిరికల్ వీడియో సాంగ్‌ కొద్ది సేపటి క్రితమే విడుదలైంది. పుష్పా, పుష్పా అంటూ సాగే ఈ పాటని చంద్రబోస్ రచించగా, దేవీశ్రీ ప్రసాద్ స్వరపరిచారు. ఈ పాటని నాకాశ్ అజీజ్, దీపక్ బ్లూ హుషారుగా ఆలపించారు. ఇక లిరికల్ వీడియోలో సంగీతం అంతా గొప్పగా లేనప్పటికీ ఈ పాట చివరిలో అల్లు అర్జున్‌ చాయ్ గ్లాసు పట్టుకొని చేసిన స్టెప్స్ చాలా బాగుంది. 

అల్లు అర్జున్‌-సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ‘పుష్ప-2 సినిమాలో ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, శ్రీతేజ్, మీమ్ గోపిలతో బాటు కొత్తగా జగపతిబాబు కూడా పుష్ప-2లో చేరారు.  

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న పుష్ప-2కి కెమెరా: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. 

ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. 2024, ఆగస్ట్ 15వ తేదీన పుష్ప-2 విడుదల కాబోతోంది.