ఎన్నికల సమరంలో హరిహర వీరమల్లు టీజర్‌!

ఓ పక్క ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలు వేసవి ఎండలు, వడగాడ్పులతో అట్టుడికిపోతున్నాయి. మరోపక్క రెండు రాష్ట్రాలు ఎన్నికల వేడి నానాటికీ పెరిగిపోతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలో పవన్‌ కళ్యాణ్‌ నటించిన హరిహర వీరమల్లు టీజర్‌ విడుదల చేస్తుండటం ఆయన అభిమానులకు ఎండాకాలంలో వర్షంవంటిదే.

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా టీజర్‌ మే 2వ తేదీ ఉదయం 9గంటలకు విడుదల కాబోతోంది.

టీజర్‌ రిలీజ్ పోస్టర్‌లో యుద్ధరంగంలో గాల్లో దూసుకువస్తున్న బాణాలు, శూలాలను చూపారు. అంటే టీజర్‌ కోసం మంచి యాక్షన్ సీన్ కట్ చేసిన్నట్లు భావించవచ్చు. రెండు రాష్ట్రాలతో పాటు దేశమంతటా అధికార ప్రతిపక్షాల మద్య లోక్‌సభ ఎన్నికల పేరుతో యుద్ధాలు జరుగుతున్నాయి కనుక హరిహర వీరమల్లు టీజర్‌ పోస్టర్ ఈ సందర్భానికి తగ్గట్లుగానే ఉంది. 

క్రిష్ దర్శకత్వంలో  రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మొదటి భాగంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్స్ జాక్విలిన్ ఫెర్నాండస్, అర్జున్ రాంపాల్, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, పూజిత పొన్నాడ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: క్రిష్, సంగీతం: ఎంఎం కీరవాణి, పాటలు: స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్రబోస్, కెమెరా: జ్ఞానశేఖర్, ఎడిటింగ్: శ్రవణ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, శామ్ కౌశల్, దిలీప్ సుబ్బరాయన్. 

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యాననర్‌లో ఏఎం రత్నం రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.