బాలకృష్ణ అఖండ తాండవం... మామూలుగా లేదు!

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ చేస్తున్న అఖండ 2: నుంచి ‘ది తాండవం’ పాట విడుదలయ్యింది. మహా శివుడిని కీర్తిస్తూ పాట సాగుతుంటే, ఆయన భక్తుడు, అఘోరాగా బాలయ్య యాక్షన్ సీన్స్ చూపించారు.

శివుడి ప్రతినిధిగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తున్నట్లు చూపారు. కనుక అఖండ-2లో దర్శకుడు బోయపాటి ఆధ్యాత్మికతతో పాటు బాలయ్య మార్క్ యాక్షన్ సీన్స్ కూడా పుష్కలంగా దట్టించి హిట్‌కి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. 

అఖండా... తాండవం... అంటూ రౌద్రంగా సాగే ఈ పాటని కళ్యాణ చక్రవర్తి వ్రాయగా థమన్ సంగీతం అందించారు. శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్, దీపక్ బ్లూ కలిసి ఆలపించారు.    

ఈ సినిమాలో సీనియర్ బాలీవుడ్‌ నటుడు సన్నీ డియోల్, ఆది పినిశెట్టి, సంయుక్త, ప్రగ్యా జైస్వాల్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: బోయపాటి శ్రీను, సంగీతం: థమన్, కెమెరా: సి. రామ్ ప్రసాద్, సంతోష్ డి డెటాకె,   ఎడిటింగ్: తమ్మిరాజు చేస్తున్నారు.   

14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై ఎమ్మెల్యేలు.తేజస్విని నందమూరి, రామ్ ఆచంట, గోపీ అచంతలతో కలిసి పాన్ ఇండియా మూవీగా అఖండ-2 నిర్మిస్తున్నారు. డిసెంబర్‌ 5న అఖండ-2 ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/rbXmleQI144?si=Mx-bvQE_pH5VsJvI" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>