కీర్తి సురేష్‌ రివాల్వర్ రీటా ట్రైలర్‌

కీర్తి సురేష్‌ పెళ్ళి చేసుకోక మునుపు నటించిన సినిమా ‘రివాల్వర్ రీటా.’ జెకె చంద్రు దర్శకత్వంలో తీసిన ఈ సినిమా ట్రైలర్‌ నేడు విడుదలైంది. ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్‌, సూపర్ సుబ్బరాయన్, అజయ్ పీసీ ఘోష్ కమీషన్‌, రెడిన్ కింగ్‌స్లీ, సురేష్ చక్రవర్తి, కళ్యాణ్ మాస్టర్, సేంద్రయన్, ఆగస్టిన్, రామచంద్రన్, గాయత్రి షాన్, కుహసిని ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: జెకె చంద్రు, సంగీతం: సియాన్ రోల్డన్, కెమెరా: దినేష్ కృష్ణన్, ఎడిటింగ్:ప్రవీణ్ కేఎల్, స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్, ఆర్ట్: ఎంకేటి చేశారు. 

పాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్లపై సుధన్ సుందరం, జగదేశ్ పలనిస్వామి కలిసి రివాల్వర్ రీటాని నవంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.