రాజమౌళి ముందే సినిమా చూపించేస్తున్నారుగా!

రాజమౌళి ఏ సినిమా చేసినా అది భారీగానే ఉంటుంది. అలాగే శనివారం రామోజీ ఫిల్మ్ ఛాంబర్‌ సిటీలో నిర్వహించబోతున్న ఈవెంట్‌ కూడా అదే స్థాయిలో నిర్వహించబోతున్నారు. ఇందుకు ఉదాహరణగా అక్కడ ఏర్పాటు చేస్తున్న భారీ స్క్రీన్ గురించి చెప్పుకోవచ్చు.

అది 100 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేస్తున్నారు. అంటే సినిమా థియేటర్ల కంటే 4-5 రెట్లు పెద్ద స్క్రీన్ అన్నమాట!

అంత పెద్ద స్క్రీన్ మీద రాజమౌళి ఏం చూపించాబోతున్నారో. ఈ ఈవెంట్‌లో టైటిల్‌, ఫస్ట్ గ్లిమ్స్‌ విడుదల చేస్తారని కొందరు, టైటిల్‌, మొదటి పాట విడుదల చేస్తారని మరికొందరు అనుకుంటున్నారు. కానీ 1000 చదరపు అడుగుల స్క్రీన్ మీద రాజమౌళి ఏం చూపించినా అద్భుతంగానే ఉంటుంది. ఎల్లుండి సాయంత్రం 6 గంటల నుంచి ఈవెంట్‌ మొదలవుతుంది. 

ఈ సినిమాలో విలన్‌ కుంభగా పృధ్వీరాజ్ సుకుమారన్, మందాకినిగా ప్రియాంకా చోప్రా నటిస్తున్నారంటూ ఫస్ట్ లుక్ పోస్టర్లతో వారి పాత్రలు ఇటీవలే పరిచయం చేశారు.  దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘గ్లోబ్ ట్రోటర్’ పేరునే ఖరారు చేస్తారో లేదా వేరే పేరు ప్రకటిస్తారో ఎల్లుండి తెలుస్తుంది.