అభిమానులకు మహేష్ బాబు వీడియో సందేశం

రేపు సాయంత్రం 6 గంటల నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ‘గ్లోబ్ ట్రోటర్’ ఈవెంట్‌ జరుగబోతోంది. రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కిస్తునందున దీనిపై చాలా భారీ అంచనాలే ఉన్నాయి. ప్రతీ ఒక్కరూ ఈ సినిమా అప్‌డేట్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 

కనుక రేపు రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగబోయే ‘గ్లోబ్ ట్రోటర్’ ఈవెంట్‌లో పాల్గొనేందుకు వేలాదిమంది వస్తున్నారు. కానీ ఇటువంటి కార్యక్రమాలలోనే తొక్కిసలాటలు జరిగి అభిమానులు చనిపోతుంటారు. లేదా ఏవో పెద్ద ప్రమాదాలు జరుగుతుంటాయి. 

కనుక ఎటువంటి అవాంచనీయమైన ఘటనలు జరుగకుండా నివారించేందుకు నిర్వాహకులు మరిన్ని జాగ్రత్తలు, మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వీటి గురించి మహేష్ బాబు బాబు స్వయంగా వివరిస్తూ అభిమానులకు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. 

రేపు జరుగబోయే కార్యక్రమానికి వచ్చేవారు తప్పనిసరిగా క్యూఆర్ కోడ్ ఉన్న పాస్‌పోర్టు (గుర్తింపు కార్డు) మెడలో ధరించాలని సూచించారు. దానిలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏ గేటులో నుంచి లోనికి ప్రవేశించాలనే వివరాలు తెలుస్తాయని చెప్పారు. అందరూ కార్లు, బైకులు వేసుకొని వస్తుంటారు. కానీ వీలైనంత వరకు వాటిని తగ్గించుకొని పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో అంటే ఆర్టీసీ బస్సులలో రావాలని మహేష్ బాబు విజ్ఞప్తి చేశారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొనే వారందరూ తప్పనిసరిగా నిర్వాహకులకు, ట్రాఫిక్ పోలీసులకు సహకరిస్తూ ఈ ఈవెంట్‌ని ఎంజాయ్ చేసి భద్రంగా ఇళ్ళకు తిరిగి వెళ్లాలని మహేష్ బాబు విజ్ఞప్తి చేశారు. 

మహేష్ బాబు ఏమన్నారో ఆయన మాటల్లోనే....