సునీల్ డైరక్షన్ కూడానా..?

కమెడియన్ కమ్ హీరో సునీల్ ఈమధ్య విలన్ గా కూడా మెప్పిస్తున్నాడు. రవితేజ డిస్కో రాజాలో చివర్లో నెగటివ్ షేడ్స్ తో షాక్ ఇచ్చాడు సునీల్. రీసెంట్ గా వచ్చిన కలర్ ఫోటో సినిమాలో ఫుల్ లెంగ్త్ నెగటివ్ రోల్ నటించి సూపర్ అనిపించాడు. ఛాన్స్ వస్తే విలన్ గా కొనసాగుతానని అంటున్నాడు సునీల్. ఇదిలాఉంటే సునీల్ ఓ మరాఠీ రీమేక్ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. అయితే మరాఠీ రీమేక్ సినిమాను సునీల్ డైరక్షన్ కూడా చేస్తాడని టాక్.

స్వీయ దర్శకత్వంలో తనే హీరోగా సునీల్ ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తుంది. కమెడియ, హీరో ఇప్పుడు విలన్ త్వరలో డైరక్షన్ సునీల్ ఒకటి కాదు అన్నిటిలో తన టాలెంట్ చూపించాలని ఫిక్స్ అయ్యాడు. మరి సునీల్ చేస్తున్న ఆ మరాఠీ సినిమా ఏది. నిజంగానే సునీల్ ఆ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడా అన్న విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం వి.ఎన్ ఆదిత్య డైరక్షన్ లో సునీల్ హీరోగా సినిమా వస్తుంది. ఈ సినిమాతో పాటుగా రెండు సినిమాల్లో సునీల్ కమెడియన్ గా కనిపిస్తాడని టాక్.