గ్లోబ్ ట్రోటర్‌: ప్రియాంక చొప్రా ఫస్ట్ లుక్ పోస్టర్‌

మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో తీస్తున్న ‘గ్లోబ్ ట్రోటర్‌’ ఈవెంట్‌ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి రామోజీ ఫిల్మ్ ఛాంబర్‌ సిటీలో జరుగబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాజమౌళి ఈ సినిమాలో ముఖ్య పాత్రలు చేస్తున్న నటీనటుల ఫస్ట్ లుక్ పోస్టర్లు వరుసపెట్టి విడుదల చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. 

ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్ర చేస్తున్న ప్రముఖ బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రా ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల చేశారు. ఆమె పాత్ర పేరు మందాకిని అంటూ పరిచయం చేశారు. 

ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్న మళయాళ నటుడు పృద్విరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ రెండు రోజుల క్రితమే విడుదల చేశారు. అతనొక అత్యంత క్రూరమైన, శక్తివంతుడైన విలన్‌ ‘కుంభ’ అంటూ పరిచయం చేశారు. 

ఇక మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్‌ ఇంకా విడుదల చేయలేదు. కానీ మహేష్ బాబు మెడలో గొలుసు దానికి శివుని అడ్డుబొట్లు, త్రిశూలం, డమరుకం, నందీశ్వరుడు ఫోటోని విడుదల చేశారు. రేపు ఈవెంట్‌లో ఫస్ట్ గ్లిమ్స్‌, ఫస్ట్ సాంగ్ విడుదల చేయవచ్చని సమాచారం.