ఒకే సినిమాలో పూజా హెగ్దే, రష్మిక మందన్న..!

ప్రస్తుతం టాలీవుడ్ ను ఊపేస్తున్న పూజా హెగ్దే, రష్మిక మందన్న ఇద్దరు నువ్వా నేనా అనే రేంజ్ లో సినిమా ఛాన్సులు అందుకుంటున్నారు. ముఖ్యంగా గ్లామర్ తో పూజా హెగ్దే, అభినయంతో రష్మిక మందన్న తెలుగు ప్రేక్షకుల మనసులు గెలిచారు. అందుకే స్టార్ హీరోలు కూడా వారితో సినిమాలకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పూజా హెగ్దే అఖిల్ బ్యాచ్ లర్, ప్రభాస్ రాధే శ్యాం లో నటిస్తుండగా రష్మిక మందన్న అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఛాన్స్ అందుకుంది.

ఇక లేటెస్ట్ గా ఈ ఇద్దరు హీరోయిన్స్ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనిదత్ నిర్మాతగా హను రాఘవపుడి డైరక్షన్ లో ఓ సినిమా వస్తుంది. ఈ సినిమాలో మళయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడు. సినిమాలో హీరోయిన్ గా ఒకరు కాదు ఇద్దరు కావాల్సి ఉండగా.. పూజా హెగ్దే, రష్మిక మందన్న ఇద్దరిని ఫిక్స్ చేయాలని చూస్తున్నారట. సూపర్ ఫాం లో ఉన్న ఇద్దరు భామలు ఒకే సినిమాలో ఉంటే మాత్రం ప్రేక్షకులకు పండుగ అన్నట్టే. ఈ సినిమాను తెలుగుతో పాటుగా తమిళ, మళయాళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారట.