
మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ రావడంతో ఈమధ్య కాలంలో ఆయన్ను కలిసిన వారు కాస్త కంగారు పడ్డారు. వీరిలో కింగ్ నాగార్జున కూడా ఉన్నారు. ఒకప్పటీలా చూడగానే ఒకరికొకరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుని హగ్ చేసుకునే పరిస్థితి లేదు. అయితే చిరంజీవి ఈమధ్య చిన్న చిన్న కార్యక్రమాలకు బయటకు వస్తున్నారు. నాగార్జున అయితే కులు మనాలిలో వైల్డ్ డాగ్ షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చారు.
చిరుకి కరోనా పాజిటివ్ అనగానే ఇద్దరు కలిసి మూడు రోజుల క్రితమే తెలంగాణా సిఎం కె.సి.ఆర్ ను కలిశారు. అయితే చిరుకి కరోనా పాజిటివ్ అని తెలియగానే నాగార్జున కూడా కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారట. అయితే నాగార్జునకు మాత్రం కరోనా నెగటివ్ రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సినిమాలే కాదు నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా కూడా చేస్తున్నారు. ఒకవేళ ఆయనకు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చి ఉంటే మాత్రం షోకి వేరే హోస్ట్ ను పెట్టాల్సి వచ్చేది. ఫైనల్ గా నాగార్జునకు కరోనా నెగటివ్ రిపోర్ట్ రావడం ఇండస్ట్రీని కొద్దిగా ఊపిరి పీల్చుకునేలా చేసింది.