వైష్ణవ్ తేజ్ కు మహేష్ సపోర్ట్..!

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా సుకుమార్ అసిస్టెంట్ డైరక్టర్ బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న సినిమా ఉప్పెన. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా నుండి ఇప్పటికే రిలీజైన రెండు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి థర్డ్ సాంగ్ రిలీజ్ కు ప్లాన్ చేశారు. ఉప్పెనలోని మూడవ సినిమా సూపర్ స్టార్ మహేష్ చేత రిలీజ్ చేయిస్తున్నారు.

ఈ నెల 11న సాయంత్రం 4:05 గంటలకు ఉప్పెనలోని మూడవ సాంగ్ రంగులద్దుకున్న సాంగ్ మహేష్ చేతుల మీదగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఇప్పటికే సూపర్ బజ్ ఏర్పడగా మహేష్ సాంగ్ రిలీజ్ చేయడంతో మరింత క్రేజ్ వస్తుంది. ఉప్పెన సినిమాలో కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్ గా నటించారు. సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయగా రిలీజ్ ఎప్పుడన్నది మాత్రం చిత్రయూనిట్ ఇంకా ఎనౌన్స్ చేయలేదు.