రానా, నితిన్ లిస్ట్ లో సుమంత్ కూడా..!

మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక హీరోగా నటిస్తున్నాడని తెలిసిందే. ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోగా ఎవరు నటిస్తారన్న విషయంపై క్లారిటీ రాలేదు. మల్టీస్టారర్ గా రాబోతున్న ఈ సినిమాలో రానా ఉంటాడని కొద్దిరోజులుగా వార్తలు రాగా ఆ తర్వాత పవర్ స్టార్ అభిమాని నితిన్ ఈ సినిమాలో పవన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటాడని అన్నారు. 

ఇక ఇప్పుడు లిస్ట్ లో అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ కూడా చేరాడు. రానా, నితిన్ లతో పాటుగా ఈ రీమేక్ లో నటించే ఛాన్సులు సుమంత్ కు కూడా ఉన్నాయని టాక్. సాగర్ చంద్ర డైరక్షన్ లో తెరకెక్కే ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ వకీల్ సాబ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత క్రిష్ డైరక్షన్ లో సినిమా కూడా ఉంది. అయ్యప్పనుం కోషియం రీమేక్ కోసం పవన్ 25 డేస్ డేట్లు ఇచ్చినట్టు తెలుస్తుంది.