మెగా హీరో దూకుడు మీద ఉన్నాడు..!

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ఉప్పెన రిలీజ్ కాకుండానే క్రిష్ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. క్రిష్ సినిమా కూడా ఈమధ్యనే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఉప్పెన సినిమా రిలీజ్ కు రెడీ అవగా మరో నెల రోజుల్లో క్రిష్ డైరక్షన్ లో సినిమా కూడా రిలీజ్ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ రెండు సినిమాల తర్వాత వైష్ణవ్ తేజ్ మరో రెండు సినిమాలు చేస్తున్నాడని తెలుస్తుంది.

ఇప్పటికే వాటి స్టోరీస్ వినడం.. గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. వైష్ణవ్ తేజ్ దూకుడు చూస్తుంటే మూడు నాలుగు సినిమాలతోనే మెగా క్రేజ్ తెచ్చుకునేలా ఉన్నాడు. ఉప్పెనకు ఆల్రెడీ సూపర్ బజ్ ఏర్పడగా క్రిష్ డైరక్షన్ లో సినిమా కూడా ప్రయోగాత్మకంగా ఉంటుందని టాక్. చేసిన రెండు సినిమాలు చాలా స్పెషల్ కాబట్టి తప్పకుండా వైష్ణవ్ తేజ్ కెరియర్ అదిరిపోతుందని అంటున్నారు.