
సినీ హీరో డాక్టర్ రాజశేఖర్ కరోనాతో పోరాడుతున్నారు. కరోనా బారిన పడిన రాజశేఖర్ సిటీ న్యూరో సెంటర్ లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం పరిస్థితి గురించి తాజాగా రాజశేఖర్ సతీమణి జీవిత మెసేజ్ ఇచ్చారు. రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి బాగానే మెరుగుపడ్డది. త్వరగా కోలుకుంటున్నారు. హాస్పిటల్ వైద్యులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అన్నారు. రాజశేఖర్ సీరియస్ కండీషన్ నుండి బయటపడ్డారని.. త్వరలోనే ఐసియు నుండి బయటకు వస్తారని అన్నారు జీవిత.
రాజశేఖర్ గారు వెంటిలేటర్ మీద ఉన్నారని వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఆ వార్తల్లో వాస్తవం లేదు. ఆయన ఎప్పుడూ వెంటిలేటర్ మీద లేరు. ఆరోగ్యం విషమించిన మాట వాస్తవమే కాని వెంటిలేటర్ మీద మాత్రం లేరని అన్నారు జీవిత. నాన్ ఇన్వాసివ్ వెంటిలేటర్ సాయంతొ ఆక్సిజన్ ను అందించారని ఆమె చెప్పారు. ప్రస్తుతం కొద్దిగా ఆక్సిజన్ సపోర్ట్ తగ్గిస్తూ ట్రీట్ మెంట్ చెస్తున్నారని అన్నారు. స్నేహితులు, శ్రేయోభిలాషులు, సహనటులు, అభిమానుల ప్రార్ధనమ వల్ల రాజశేఖ గారు క్షేమంగా ఉన్నారని జీవిత చెప్పారు.