సెట్స్ మీదకు ఆచార్య.. షూటింగ్ ఎప్పుడంటే..!

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ ఆచార్య. ఈ సినిమాను మ్యాట్నీ మూవీస్ లో నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. సినిమాలో చిరుతో పాటుగా రాం చరణ్ కూడా నటిస్తున్నాడని తెలిసిందె. ఇక ఈ సినిమాలో కాజల్, రష్మిక మందన్న హీరోయిన్స్ గా నటిస్తారని తెలుస్తుంది. కరోనా లాక్ డౌన్ తర్వాత ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలుపెడతారా అన్న కన్ ఫ్యూజన్ ఉంది. లేటెస్ట్ గా రూమర్స్ కు చెక్ పెడుతూ ఆచార్య నవంబర్ 9 నుండి తిరిగి షూటింగ్ మొదలు పెడుతున్నారట.

నెల రోజుల పాటు జరిగే ఈ లాంగ్ షెడ్యూల్ లో సినిమాకు సంబందించిన ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేస్తారని. ఈ షెడ్యూల్ తో సినిమా దాదాపు పూర్తవుతుందని అంటున్నారు. కొరటాల శివ మరో మంచి సోషల్ మెసేజ్ తో ఈ సినిమా చేస్తున్నారని తెలుస్తుంది. ఆచార్య సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. తప్పకుండా సినిమా అంచనాలను మించి ఉంటుందని అంటున్నారు.