సంబంధిత వార్తలు

మెగా బ్రదర్ నాగబాబు తనయురాలు నిహారిక ఆగష్టు 13న వెంకట చైతన్యతో ఎంగేజ్మెంట్ జరుపుకున్న విషయం తెలిసిందే. గుంటూరు ఐజి జొన్నలగడ్డ ప్రభాకర్ రావు తనయుడైన వెంకట చైతన్య సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడట. వీరి పెళ్లి డేట్ టైం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. డిసెంబర్ 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు వెంకట చైతన్య, నిహారిక ఒకటవనున్నారు.
వివాహ పత్రికను స్వాతి వారి దగ్గర ఉంచి పూజలు నిర్వహించారు. తిరుగుమ శ్రీవారి దర్శనం అనంతరం ప్రభాకర్ రావు ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఉన్న ఉదయ్ విలాస్ లో నిహారిక చైతన్యల మ్యారేజ్ జరుగనున్నట్టు తెలుస్తుంది.