
అల వైకుంఠపురములో సినిమా తర్వాత గ్యాప్ ఇచ్చిన త్రివిక్రం తన నెక్స్ట్ సినిమా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో ఫిక్స్ చేసుకున్నాడని అన్నారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత తారక్ చేసే సినిమా త్రివిక్రం తోనే అని వార్తలు వచ్చాయి. అయితే ప్రసుత్తం ట్రిపుల్ ఆర్ పూర్తి చేయాలంటే మరో ఆరు నెలలు కష్టపడాల్సిందే. ఈ సినిమా పూర్తి చేసేదాకా వేరే సినిమా చేసే ఛాన్స్ లేదు. అందుకే ఎన్.టి.ఆర్, త్రివిక్రం సినిమా ఉంటుంది కాని నెక్స్ట్ ఇయర్ మిడిల్ దాకా టైం పట్టేలా ఉందని టాక్.
అయితే ఈ లోగా ఓ చిన్న సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు త్రివిక్రం. ఎనర్జిటిక్ స్టార్ రాం హీరోగా త్రివిక్రం డైరక్షన్ లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుందని తెలుస్తుంది. రామ్ తో అనుపమ ఉన్నది ఒకటే జిందగి, హలో గురు ప్రేమ కోసమే సినిమాలు చేసింది. ఈ ఇద్దరు కలిసి త్రివిక్రం సినిమాతో హ్యాట్రిక్ కొడుతున్నారు. త్రివిక్రం డైరెక్ట్ చేసిన అ ఆ సినిమాతోనే మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ తెలుగు తెరకు పరిచయం అయ్యింది.