
నాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్యామ్ సింగ రాయ్. టాక్సీవాలా సినిమాతో సత్తా చాటిన రాహుల్ తన సెకండ్ మూవీ కూడా ప్రయోగం చేస్తున్నాడని తెలుస్తుంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో చెరుకూరి సుధాకర్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ లో నారా రోహిత్ నటిస్తాడని అంటున్నారు. హీరోగా వెనకపడ్డ రోహిత్ సపోర్టింగ్ రోల్స్ కు ఓకే చెబుతున్నాడని టాక్. రీసెంట్ గా అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నారా రోహిత్ నటిస్తున్నాడని అన్నారు కాని ఆ వార్తల్లో నిజం లేదని తెలిసింది. నాని శ్యామ్ సింగ రాయ్ సినిమాలో అయినా నారా హీరో ఉంటాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.