
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న వకీల్ సాబ్ నుండి రెండు పోస్టర్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. సినిమా టీజర్ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఎక్సయిటింగ్ గా ఉన్నారు. దసరాకి టీజర్ వస్తుందని అనుకున్న ఫ్యాన్స్ ఆశల మీద నీళ్ళు చల్లారు చిత్రయూనిట్. ఇదిలాఉంటే దీపావళికి మాత్రం పక్కా గిఫ్ట్ వస్తుందని తెలుస్తుంది. ఈ దీపవళికి పవర్ స్టార్ ఫ్యాన్స్ పండుగ ఉత్సాహం రెట్టింపు అయ్యేలా వకీల్ సాబ్ టేర్జ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
టీజర్ కోసం పవర్ స్టార్ డబ్బింగ్ కూడా చెప్పినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ పింక్ రీమెక్ గా వస్తున్న వకీల్ సాబ్ సినిమా 2021 సంక్రాంతి రిలీజ్ అంటున్నారు. సినిమాలో శృతి హాసన్, నివేదా థామస్, అంజలిలు నటిస్తున్నారు. దీపావళికి టీజర్ తో ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.