
స్వీటీ అనుష్క పెళ్లెప్పుడు అనేది మీడియా సర్కిల్స్ లో ఎప్పుడూ నడిచే హాట్ టాపిక్. ప్రభాస్ పెళ్ళి ప్రస్థావన తెచ్చినప్పుడల్లా అనుష్కను ఎటాక్ చేయడం సర్వసాధారణం అయ్యింది. పెళ్లిపై అనుష్కని ఎప్పుడు అడిగినా సరే ఆన్సర్ చెప్పేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేది కాదు ఇక లేటెస్ట్ చిట్ చాట్ లో పెళ్లిపై తన అభిప్రాయాన్ని షేర్ చేసుకుంది అనుష్క.
వివాహ వ్యవస్థని తను నమ్ముతానని.. పిల్లలు కూడా ఉండాలని కోరుకుంటానని అన్నారు అనుష్క. అయితే ఈ విషయంపై తొందర ఏమి లేదని.. నచ్చిన వాడు దొరికినప్పుడు మాత్రమె మ్యారేజ్ చేసుకుంటా అని అంటుంది అనుష్క. 20 ఏళ్ళ వయసు వచ్చినప్పుడే తన పేరెంట్స్ పెళ్లి గురించి ఒత్తిడి చేశారని.. అయితే ఇప్పుడు వారి ఆలోచన మారిందని అనుష్క అన్నారు. ఈమధ్యనే నిశ్శబ్ధం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుష్క. తన నెక్స్ట్ సినిమాపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.