నాగశౌర్య 'వరుడు కావలెను'

యువ హీరో నాగ శౌర్య సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా అతని కెరియర్ జోష్ ఫుల్ గా ఉంది. ఈ ఇయర్ అశ్వద్ధామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ శౌర్య ప్రస్తుతం సంతోష్ జాగర్లమూడి డైరక్షన్ లో పార్ధు సినిమా చేస్తున్నాడు. పిరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా తర్వాత నాగ శౌర్య రెండు సినిమాలు ముహుర్తం పెట్టాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ శౌర్య హీరోగా సినిమా ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్లింది. ఈ సినిమాను సౌజన్య డైరెక్ట్ చేస్తున్నారు. 

సినిమాలో హీరోయిన్ గా రీతు వర్మ నటిస్తుంది. ఈ సినిమాకు టైటిల్ గా వరుడు కావలెను అని పెట్టబోతున్నారట. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. 2021 సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారని టాక్. మొత్తానికి నాగ శౌర్య మరో క్రేజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.