చిరు చేసిన కె.ఎఫ్.సి చికెన్..!

మెగాస్టార్ చిరంజీవి ఈమధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. మెగాస్టార్ గా మెగా అభిమానుల హృదయాలు గెలిచిన చిరు ఈమధ్య తన ఇంట్లో స్పెషల్ డిషెస్ చేస్తూ అలరిస్తున్నాడు. అప్పట్లో ఉప్మా దోస, చేపల వేపుడు చేసిన చిరు లేటెస్ట్ గా ఇంట్లో తన మనవరాళ్ల కోసం కె.ఎఫ్.సి చికెన్ చేశారు. ఈ స్పెషల్ డిష్ తయారు చేసేందుకు చిరంజీవి తన మనవరాళ్ల సపోర్ట్ తీసుకున్నాడని తెలుస్తుంది.

ఇక రేపటి తరం అభిరుచికి నచ్చేటట్టు, రుచిగా ఏమన్నా చేయగలిగితే...ఆ కిక్కే వేరప్పా అంటూ ఓ కామెంట్ కూడా పెట్టారు. అంతా బాగుంది చివరన ఆ కిక్కే వేరప్పా అని తమ్ముడు పవన్ డైలాగ్ వాడి పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఖుషి చేశారు మెగాస్టార్. ఇక సినిమాల విషయానికి వస్తే కొరటాల శివ డైరక్షన్ లో ఆచార్య సినిమా చేస్తున్న చిరు ఆ సినిమా పూర్తయ్యాక వరుసగా మూడు సినిమాలు లైన్ లో ఉంచారు.