కాజల్ పెళ్లి డ్రెస్ కోసం అంతమంది అన్ని రోజులు కష్టపడ్డారట..!

దశాబ్ధంన్నరకు పైగా తెలుగులో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న భామ కాజల్ అగర్వాల్. ఆమె తన స్నేహితుడు గౌతం కిచ్లుని అక్టోబర్ 30న పెళ్ళాడింది. ఇక పెళ్లిలో ఎట్రాక్షన్ గా నిలిచింది కాజల్ లెహంగా. ఈ స్పెషల్ డిజైనర్ లెహంగా కోసం చాలా కష్టపడ్డామని అన్నారు ఫ్యాషన్ డిజైనర్ అనామిక ఖన్నా. ఈ లెహంగా ఎంబాయిడరీ వర్క్ కోసం 20 మంది నెల రోజులు కష్టపడ్డారని చెప్పింది. లెహంగా ఖరీదు కూడా లక్షల్లో ఉన్నట్టు తెలుస్తుంది. కాజల్ పెళ్లి వేడుక కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. కాజల్ లెహంగా గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమాలో నటిస్తుంది కాజల్ ఈ సినిమాతో పాటుగా ఇండియన్ 2లో కూడా కాజల్ నటిస్తుంది.