
రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఇప్పటికే అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తుండగా సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తుందని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ మూవీలో తమిళ హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ కూడా నటిస్తున్నట్టు టాక్. సినిమాలో ఎన్.టి.ఆర్ కు జోడీగా ఒలివియా మోరిస్ నటిస్తుండగా మరో ఇంపార్టెంట్ రోల్ లో ఐశ్వర్య కనిపిస్తుందని తెలుస్తుంది.
ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ ఉంటుందని అంటున్నారు. తెలుగులో కౌసల్యా కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు చేసినా సరే హిట్ దక్కించుకోలేని ఐశ్వర్య రాజేష్ తమిళంలో మాత్రం స్టార్ క్రేజ్ దక్కించుకుంది. తెలుగులో ఓ మంచి ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న అమ్మడికి ఆర్.ఆర్.ఆర్ ఛాన్స్ రావడం నిజంగానే లక్కీ అని చెప్పొచ్చు. మరి ఐశ్వర్య రాజేష్ ఆర్.ఆర్.ఆర్ తో తెలుగులో కూడా తన ఫాం కొనసాగిస్తుందో లేదో చూడాలి.