కలర్ ఫోటో టీం ను ప్రశంసించిన అల్లు అర్జున్..!

ఛాయ్ బిస్కెట్ సందీప్ రాజ్ డైరక్షన్ లో సుహాస్, చాందిని చౌదరి కలిసి నటించిన సినిమా కలర్ ఫోటో. ఈ సినిమాను సాయి రాజేష్ నిర్మించారు. ఈ సినిమాలో సునీల్ విలన్ గా నటించాడు. ఆహాలో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల మనసులు గెలిచింది. అక్టోబర్ 23న రిలీజైన ఈ సినిమా ఆడియెన్స్ ను మెప్పించడమే కాకుండా స్టార్స్ నుండి ప్రశంసలు అందుకుంది. ఇప్పటికే సినిమా చూసిన నాని, విజయ్ దేవరకొండ స్పెషల్ ట్వీట్స్ వేయగా లేటెస్ట్ గా అల్లు అర్జున్ కూడా సినిమా గురించి ట్వీట్ చేశారు.

సినిమా గురించి ట్వీట్ చేయడమే కాకుండా కలర్ ఫోటో టీం ను ఆఫీస్ కు పిలిచి తన అభినందనలు తెలిపాడు అల్లు అర్జున్. స్టార్ హీరోగా మెప్పిస్తూ తన మనసుకి నచ్చిన సినిమాలను ప్రమోట్ చేయడంలో అల్లు అర్జున్ ఎప్పుడూ ముందుంటాడు. కలర్ ఫోటో టీం ను కలిసి బన్నీ తన స్పెషల్ విషెస్ అందించారు.