
కన్నడ స్టార్ హీరో యశ్ కె.జి.ఎఫ్ రిలీజ్ కు ముందు ఎలా ఉన్నా ఆ సినిమా రిలీజ్ తర్వాత సౌత్ స్టార్ హీరోగా మారాడు. కె.జి.ఎఫ్ తో సత్తా చాటిన యశ్ ప్రస్తుతం ఆ సినిమా పార్ట్ 2 చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా భారీ అంచనాలతో వస్తుంది. ఇక కె.జి.ఎఫ్ చాప్టర్ 2 తర్వాత శంకర్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు యశ్.
కె.జి.ఎఫ్ హీరో యశ్ తో శంకర్ మూవీ అనగానే ఆడియెన్స్ లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం కమల్ హాసన్ తో శంకర్ చేస్తున్న ఇండియన్ 2 దాదాపు ఆగిపోయినట్టే అంటున్నారు. అందుకే యశ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ తో బిజీగా ఉన్నారు శంకర్. ఈ సినిమాను మల్టీస్టారర్ గా తెరకెక్కిస్తారని తెలుస్తుంది. యశ్ తో విజయ్ సేతుపతి స్క్రీన్ షేర్ చేసుకుంటారని టాక్. రాక్ లైన్ వెంకటేష్ ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది. మొత్తానికి కె.జి.ఎఫ్ తో వచ్చిన క్రేజ్ తో శంకర్ తో ఛాన్స్ అందుకున్నాడు యశ్. మరి ఈ కాంబోలో వచ్చే సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.