
అనీల్ రావిపుడి డైరక్షన్ లో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమా ఎఫ్-2 సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సినిమా సీక్వల్ గా ఎఫ్-3ని ఎనౌన్స్ చేశారు. వెంకటేష్, వరుణ్ తేజ్ సినిమా స్క్రిప్ట్ రెడీ అయ్యిందని తెలుస్తుంది. 2021 సంక్రాంతికి ఎఫ్-3 ముహుర్తం ఫిక్స్ చేశారట. దిల్ రాజు బ్యానర్ లోనే ఈ సినిమా నిర్మిస్తారని అంటున్నారు.
ప్రస్తుతం వెంకటేష్ నారప్ప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎఫ్-3కి డేట్స్ ఇస్తారట. వరుణ్ తేజ్ కూడా బాక్సర్ సినిమా పూర్తి కాగానే ఎఫ్-3 షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తుంది. ఈ ఇయర్ మొదట్లోనే సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనీల్ రావిపుడి ఎఫ్-3లో మరోసారి ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.