
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలిసి చేస్తున్న హ్యాట్రిక్ మూవీ సెట్స్ మీద ఉంది. కరోనా లాక్ డౌన్ కు ముందు ఒక భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లాక్ డౌన్ తర్వాత గురువారం అనగా ఈరోజు మళ్లీ సెట్స్ మీదకు వెళ్లిందని తెలుస్తుంది. సినిమా షూటింగ్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతుండగా బాలకృష్ణ, బోయపాటి సినిమా షూటింగ్ కూడా మొదలైంది.
ఈ సినిమా నుండి వచ్చిన బిబి 3 టీజర్ సూపర్ హిట్ కాగా. సినిమా టైటిల్ ఏంటన్నది మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యుయల్ రోల్ చేస్తున్నారని తెలుస్తుంది. బాలయ్య సరసన మళయాళ భామ ప్రగ్యా మార్టీన్ నటిస్తుంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.