
బిగ్ బాస్ సీజన్ 3లో క్రేజీ కంటెస్టంట్ పునర్నవి భూపలం ఫైనల్ గా తన సోల్ మేట్ ను వెతుక్కుంది. బిగ్ బాస్ సీజన్ 3లో రాహుల్ తో కలిసి ఆట ఆడిన పునర్నవి ఆ షో ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకుంది. హౌజ్ లో రాహుల్, పునర్నవి క్లోజ్ గా మూవ్ అయ్యారు. వీరిద్దరి క్లోజ్ నెస్ చూసి బయటకు వచ్చాక ఇద్దరు పెళ్లి చేసుకుంటారేమో అనుకున్నారు. హౌజ్ లో ఉన్నంత వరకు సీరియస్ రిలేషన్ షిప్ అనుకున్న వీరు హౌజ్ నుండి బయటకు వచ్చాక మాత్రం ఎవరి దారి వారు చూసుకున్నారు.
ఇక ఫైనల్ గా బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి ఎంగేజ్మెంట్ జరుపుకుంది. ఫైనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్ అంటూ ఇన్ స్టాగ్రాంలో ఎంగేజ్మెంట్ రింగ్ ను చూపిస్తూ కామెంట్ పెట్టింది. మొత్తానికి రాహుల్ తో ప్రేమ పెళ్లి వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ పునర్నవి పెళ్లి ఫిక్స్ చేసుకుంది. ఇంతకీ పునర్నవిని పెళ్లి చేసుకునే ఆ లక్కీ గాయ్ ఎవరన్నది మాత్రం రివీల్ చేయలేదు.