బిగ్ బాస్ హోస్ట్ గా సమంత రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

బిగ్ బాస్ సీజన్ 4లో నాగార్జున హోస్ట్ గా చేస్తుండగా దసరా రోజున నాగ్ ప్లేస్ లో అక్కినేని కోడలు సమంత హోస్ట్ గా చేసింది. హోస్ట్ గా సమంత అదరగొట్టేసింది. నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం మనాలిలో ఉండగా ఆయన ప్లేస్ లో సమంత వచ్చి సందడి చేసింది. కేవలం దసరా స్పెషల్ ఎపిసోడ్ మాత్రమే కాదు మరో నాలుగు ఎపిసోడ్స్ కూడా సమంత హోస్ట్ గా చేస్తుందని తెలుస్తుంది. 

బిగ్ బాస్ లో సమంత హోస్ట్ గా చేస్తున్నందుకు 5 ఎపిసోడ్స్ కు 2.1 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ గా తీసుకుందని తెలుస్తుంది. సమంత డిమాండ్ మేరకు ఆమె అడిగినంత ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అందుకే ఒక్కో ఎపిసోడ్ కు 40 లక్షల చొప్పున తీసుకుంటుందని టాక్. మొత్తానికి బిగ్ బాస్ షోలో కూడా సమంత తన సత్తా చాటుతుంది. మొదటి ఎపిసోడ్ సూపర్ హిట్ కాగా మరో నాలుగు ఎపిసోడ్స్ లో కనిపిస్తుందని తెలుస్తుంది.