
మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మరో హీరోగా ఎవరు నటిస్తారా అన్న కన్ ఫ్యూజన్ కొనసాగుతుంది. అసలైతే అయ్యప్పనుం కోషియం రీమేక్ లో మొదట నుండి అనుకుంటున్న పేరు రానా. పవన్, రానా కలిసి ఈ సినిమా చేస్తారని అనుకున్నారు కాని రానా ప్లేస్ లో పవన్ అభిమాని నితిన్ ను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.
పవర్ స్టార్ అభిమాని అని చెప్పుకునేందుకు ఎప్పుడు గర్వపడే నితిన్.. తన సినిమా ప్రమోషన్స్ లో కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తాడు. ఇక ఇప్పుడు పవర్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకునే లక్కీ ఛాన్స్ కూడా పట్టేశాడని అంటున్నారు. ఏకే తెలుగు రీమేక్ లో పవన్, నితిన్ నటిస్తే మాత్రం ఆ సినిమాకు స్పెషల్ క్రేజ్ ఏర్పడినట్టే. మరి పవన్ ను ఢీ కొట్టే పాత్రలో నితిన్ నటిస్తాడా లేక మరెవరైనా ఆ ఛాన్స్ అందుకుంటారా అన్నది చూడాలి.