నారప్ప తర్వాత అతనితోనే వెంకటేష్..!

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ అసురన్ రీమేక్ గా నారప్ప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్నాడు. కరోనా లాక్ డౌన్ వల్ల షూటింగ్ వాయిదా పడగా త్వరలో మళ్ళీ తిరిగి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత వెంకటేష్ యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాల టైంలోనే సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో వెంకటేష్ సినిమా ఉంటుందని అన్నారు. కాని ఎందుకో ఆ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వస్తుంది.

ఫైనల్ గా తరుణ్ భాస్కర్ వెంకటేష్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో వెంకటేష్ లెక్చరర్ గా కనిపిస్తారని తెలుస్తుంది. యువ దర్శకుడిగా తరుణ్ భాస్కర్ టాలెంట్ ఏంటన్నది ఇప్పటికే అతను చేసిన సినిమాలతో ప్రూవ్ అయ్యింది. మరి వెంకటేష్ తో తరుణ్ భాస్కర్ అదే మ్యాజిక్ రిపీట్ చేస్తాడో లేదో చూడాలి.