
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య తర్వాత మూడు సినిమాలను లైన్ లో పెట్టారు. అందులో రెండు రీమేక్ సినిమాలు ఉన్నట్టు తెలుస్తుంది. మళయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ గా సినిమా చేస్తున్న చిరంజీవి తమిళంలో సూపర్ హిట్టైన వేదాళం రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మెహెర్ రమేష్ డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తుంది.
ఈ సినిమాలో చిరు చెల్లి పాత్రలో మహానటి కీర్తి సురేష్ నటిస్తుందని టాక్. మొన్నటిదాకా ఈ పాత్రకి సాయి పల్లవిని సెలెక్ట్ చేశారని వార్తలు రాగా ఫైనల్ గా కీర్తి సురేష్ ను ఫిక్స్ చేశారట. ఓ పక్క సోలో సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతున్న కీర్తి సురేష్ కమర్షియల్ సినిమాలను చేస్తుంది. లేటెస్ట్ గా చిరు సినిమాలో కూడా సిస్టర్ రోల్ కు ఓకే చెప్పిందని టాక్. మొత్తానికి తెలుగులో ఎలాంటి ఛాన్స్ వచ్చినా సరే వదిలిపెట్టకుండా చేస్తుంది కీర్తి సురేష్. మరి చిరు వేదాళం రీమేక్ లో కీర్తి సురేష్ నటిస్తుందా లేదా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.