రాజశేఖర్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ రిలీజ్

సినీ హీరో రాజశేఖర్ కరోనా బారిన పడగా సిటీ న్యూరో సెంటర్ లో ట్రీట్ మెంట్ జరుపుకుంటున్నారు. కరోనాతో పొరాడుతున్న రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై హాస్పిటల్ వర్గాలు ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా సిటీ న్యూరో సెంటర్ వైద్యులు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఐసీయులో నాన్ ఇన్ వాసివ్ వెంటిలేషన్ పై ఉంచి చికిత్స అందిస్తున్నామని వైద్యులు హెల్త్ బులిటె రిలీజ్ చేశారు. 

ఈరోజు రాజశేఖర్ కు ప్లాస్మా థెరపీ కూడా చేశామని.. సైటో సోర్బ్ పరికరం ద్వారా చికిత్స చేస్తున్నామని వైధ్యులు వెల్లడించారు. అయితే రాజశేఖర్ ఆరోగ్యం మెరుగుపడుతుందని గతంతో పోలిస్తే కొద్దిగా మెరుగుపడిందని హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు.