రాజమౌళికి వార్నింగ్ ఇచ్చిన ఎంపి

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా నుండి రీసెంట్ గా రిలీజైన కొమరం భీమ్ టీజర్ పై పలు విమర్శలు వస్తున్నాయి. కొమరం భీమ్ టీజర్ లో చివర్లో ఆ పాత్రకి పెట్టిన టోపీ తొలగించాలని ఆదిలాబాద్ బిజేపి ఎంపి సోయం బాపు రావు డిమాండ్ చేశారు. నిజాం వ్యతిరేకంగా కొమరం భీమ్ పోరాటం చేసి అమరుడయ్యారని.. భీమ్ ను చంపిన వాళ్ల టోపీ ఆయనకు పెట్టడం ఆదివాసులను అవమానించడమే అని ఎంపి అన్నారు. 

రాజమౌళి చరిత్ర తెలుసుకోవాలని.. లేకుంటే మర్యాదగా ఉండదని ఎంపి సోయం బాపు రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ తమ మాటలని లెక్క చేయకుండా అలానే విడుదల చేస్తే థియేటర్లు తగుల బెట్టే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. మీ సినిమా కలక్షన్ల కోసం మా ఆరాధ్య దైవాన్ని కించ పరిస్తే ఊరుకునేది లేదని సోయం బాపు రావు అన్నారు. ఎప్పుడూ లేనిది రాజమౌళి సినిమాకు ఇలాంటి విమర్శలు వస్తున్నాయి.  కొమరం భీం టీజర్ పై వస్తున్న ఈ వార్తలకు రాజమౌళి ఎలా స్పందిస్తారో చూడాలి.