ఆ రీమేక్ కు 25 రోజులు మాత్రమేనా..?

వరుస సినిమాలు ఎనౌన్స్ చేస్తూ మెగా, పవర్ ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ ఇస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వకీల్ సాబ్ కాకుండానే ఆ తర్వాత ఐదు సినిమాలు లైన్ లో పెట్టాడు. క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలు ఇప్పటికే కన్ఫాం అవగా లేటెస్ట్ గా దసరా రోజు మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం రీమేక్ ను కూడా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమాను సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది.

ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ కేవలం 25 రోజుల డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. పాతిక రోజుల్లో తన పోర్షన్ కంప్లీట్ చేసేలా షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారట. అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ లో పవర్ స్టార్ తో పాటుగా రానా కూడా స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడని తెలుస్తుంది. ఏకే రీమేక్ లో పవర్ స్టార్ పోలీస్ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించనున్నారు.