అవి లేకుండా చిరు సినిమానా..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న ఆచార్య తర్వాత 3 సినిమాలు లైన్ లో పెట్టాడు. మళయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కు రీమేక్ గా ఓ సినిమా వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాను వినాయక్ డైరెక్ట్ చేస్తారని తెలిసిందే. మళయాళ సినిమాలో సాంగ్స్ లేకుండా సినిమా నడిపించారు. అయితే తెలుగులో చిరు సినిమా అలా సాంగ్స్ లేకుండా చేయడం సాహసమే అని చెప్పాలి. అందుకే వినాయక్ అవి లేకుండా చిరు సినిమా చేయనని అంటున్నాడు.

తెలుగు నేటివిటీకి తగినట్టుగా లూసిఫర్ కథ మారుస్తున్నారట. అంతేకాదు మెగా ఫ్యాన్స్ కోరుకునే అంశాలన్ని ఉంటాయని తెలుస్తుంది. చిరు సినిమా అంటే డ్యాన్సులు, ఫైట్లు ఉండాల్సిందే లూసిఫర్ రీమేక్ లో కూడా ఇవన్ని ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట వినాయక్. ఆల్రెడీ తమిళ సినిమాలు రమణ, కత్తి రీమేక్ లుగా వచ్చిన ఠాగూర్, ఖైది నంబర్ 150 సినిమాలు వినాయక్ రీమేక్ చేసి హిట్ కొట్టాడు. ముచ్చటగా మూడవసారి ఈ కాంబో రిపీట్ అవుతుంది. మరి ఈసారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.