
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాధ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత పూరీ జగన్నాధ్ మరోసారి బాలకృష్ణ హీరోగా సినిమా చేస్తాడని టాక్. ఆల్రెడీ పూరీ, బాలయ్య కాంబోలో పైసా వసూల్ సినిమా వచ్చింది. బాలకృష్ణని డిఫరెంట్ యాంగిల్ చూపించి జస్ట్ ఓకే అనిపించుకున్నాడు పూరీ.
ఇక ఈ కాంబోలో మరో సినిమా రాబోతుంది. ఫైటర్ తర్వాత పూరీ, బాలయ్య మూవీ దాదాపు కన్ఫాం అంటున్నారు. ప్రస్తుతం బాలయ్య బాబు బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి చేశాక నెక్స్ట్ పూరీతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడట బాలకృష్ణ. పూరీతో బాలకృష్ణ మూవీ మరో పైసా వసూల్ అవుతుంది అంతకుమించి ఈసారి సూపర్ హిట్ కొడతారా అన్నది చూడాలి.