
సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ తనకు కాబోయే భర్త గౌతం కిచ్లుతో దిగిన ఓ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమధ్యనే గౌతం కిచ్లుతో ఎంగేజ్మెంట్ జరుపుకుంది కాజల్. ఈ నెల 30న కొద్దిమంది సమక్షంలోనే వీరి మ్యారేజ్ జరుగనుంది. కాబోయే భర్తతో కాజల్ దిగిన పిక్ తన సోషల్ ఫ్లాట్ ఫాం లలో పెట్టింది.
ఇద్దరు కలిసి తమ ఫాలోవర్స్ కు దసరా శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు హ్యాష్ ట్యాగ్ కాజ్ గౌ కిచెడ్ అంటూ పెట్టింది కాజల్. కొన్నాళ్లుగా పరిచయం ఉన్న గౌతం తో జీవితాన్ని పంచుకుంటుంది కాజల్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్యతో పాటుగా శంకర్ డైరక్షన్ లో వస్తున్న ఇండియన్ 2 సినిమాలో కూడా ఆమె నటిస్తుంది. మంచు విష్ణుతో చేస్తున్న మోసగాళ్లు సినిమాలో కూడా ఆమె నటిస్తుంది.